chaithi

జాజి పూలు నేస్తం: భానుమతి గృహ లక్ష్మి సమీక్ష

In సమీక్ష, సినిమా, GUEST book on October 2, 2009 at 9:40 am

తెలుగు బ్లాగర్ల నేస్తం జాజిపూలంటూ మనకెన్నో కబుర్లని చెప్తారు కదా. ఇక్కడ మా(మన) బుక్స్ అండ్ గాళ్ఫ్రెండ్స్ లో మంచి కబుర్లు చెప్పమని అడిగితే మా(మన) కోసం ఒక చక్కని పాత సినిమా గురించి చెప్తున్నారు. ఆ సినిమా పేరు గృహ లక్ష్మి.

నేస్తం మాటల్లోనే…

నాకు సినిమా సమీక్షలు చదవడం ఇష్టం .ఆ మాటకొస్తే రాయడం ఇంకా ఇష్టం .మరి ఎందుకు రాయలేదంటే కారణాలు రెండు ..ఒకటి:- సమీక్షలు రాయడం చేత కాక.రెండు ఒకవేళ నాకు వచ్చినట్లుగా రాసి ముచ్చట తీర్చుకుందామన్నా ,నేను రాద్దామనుకున్న సినిమాలపై ఇప్పటికి పది  కి తక్కువకాకుండా సమీక్షలు అందరూ రాసేయడం వల్ల :)

సరే గీతాచార్యగారి పుణ్యామా అని మొన్న నాకు గుర్తువచ్చిన ,ఇష్టమైన సినిమా మీద మొదటిసారిగా ఇలా రాస్తున్నాను .. ఆ సినిమా పేరు గృహలక్ష్మి ..ఆగండాగండి ఇది 1938 లో నాగయ్యగారు నటించిన గృహలక్ష్మి కాదు 1984 లో మోహన్ బాబు గారి సినిమా అసలే కాదు . 1967 లో భానుమతి గారు, అక్కినేని నాగేశ్వరరావు  నటించిన భరణి పిక్చర్స్ వారి గృహలక్ష్మి.

అలనాటి మేటినటులైన ఎస్.వి రంగారావు గారు,సూర్యకాంతం గారు ,పద్మనాభం,రమణా రెడ్డి లాంటి అనేక మంది హేమాహేమిలు ఈ సినిమాలో నటించారు.. ఇక సినిమా కధ కొస్తే క్లుప్తం గా ఇది.

ఎస్.వి రంగారావు,సూర్యకాంతం  గారి ఏకైక కుమారుడు నాగేశ్వర రావు ..హీరో చదువుతుండగానే కొన్ని కారణాలవల్ల అతనికి భానుమతి నిచ్చి వివాహం చేసేస్తారు పెద్దవారు. అయితే ఇక్కడే మొదలవుతుంది అసలు స్టోరీ.

Gruha Lakshmi1 వివాహం విధ్యానాశాయ అంటారు కాబట్టి చదువు పూర్తి అయ్యేవరకూ అబ్బాయి కోడలి తో    మాట్లడరాదు,చూడరాదు అని అనేక కండిషన్లు పెడతాడు హీరో తండ్రి ..పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లో ఉంటే  నలుగురూ నానా రకాలు అంటారని భానుమతి మామ గారి ఇంట్లోనే ఉంటుంది.కొత్తగా పెళ్ళయిన జంట ఒకే ఇంట్లో  ఉండి ఒకరితో ఒకరు మాట్లాడుకుండా ఉండటం ఆ జంటకు కష్టం గా ఉంటుంది. ఒక ప్రక్క హీరో తల్లి క్రొత్త జంటను  విడదీయడం పాపం అని భర్తకు చెప్పి  చీవాట్లు తింటూ ఉంటుంది ..ఇదిలా ఉంటే హీరో భార్యతో మాట్లాడడానికి  అనేకానేక ప్లాన్లు వేసి కుదరక తండ్రికి దొరికిపోయి చీవాట్లు తిని చివరకు బావమరిది పద్మనాభం సహాయం తో  భానుమతి తల్లిగారికి వంట్లో బాలేదని అల్లుడిని ,కూతురిని చూడాలంటుంది అని టెలిగ్రాం ఇప్పిస్తాడు .  రంగారావుగారికి పని ఉండటం వల్ల చేసేది లేక కోడలిని జాగ్రత్తగా ఆమె తల్లిగారి దగ్గరకు దింపమని కొడుకుకి  పురమాయిస్తాడు.

అయితే ఆమెను నేరుగా ఒక పెద్ద హొటల్ కి తీసుకు వెళ్ళిపోతాడు హీరో.. అప్పటివరకు తల్లి గురించి ఆందోళన  పడుతున్న భానుమతి విషయం విని మండిపడుతుంది .పెద్ద వాళ్ళకు తెలిస్తే పరువు పోతుంది వెనుకకు పోదామని  బ్రతిమాలు కుంటుంది.హీరో ఒప్పించి ఆమెను రూం కి తీసుకు పోయి ఒక వింత కోరిక కోరతాడు. తన పెళ్ళి తండ్రి  హడావుడిగా జరిపించడం వల్ల ఆస్వాదించలేక పోయాడు కాబట్టి మళ్ళీ పెళ్ళి చేసుకుందాం అంటాడు. ముందు  భానుమతి ఒప్పుకోకపోయినా భర్త  సరదా కాదనలేక పోతుంది.

అయితే ఇక్కడే వారికి చిక్కు మొదలవుతుంది .అదే లాడ్జ్ లో  అనేక జంటలకు వీరి వ్యవహారం అనుమానం  వచ్చేదిగా అనిపిస్తుంది. హీరో ఎవరో అమ్మాయిని పెళ్ళికాక మునుపే తీసుకుని వచ్చేసాడని ,ఇది సంసారులు ఉండే  లాడ్జని,ఇలాంటి వారిని ఆ లాడ్జ్లో ఉండనిస్తే తామంతా ఖాళీ చేసి వెళ్ళిపోతామని  ఆ లాడ్జ్ యజమానిని    బెదిరిస్తారు.ఒక ప్రక్క డబ్బు తెస్తానని వెళ్ళిన బావమరిది ఇంకా రాక హీరో చిక్కుల్లో పడతాడు.

Gruha Lakshmi1

కూతురి కాపురం ఎలా ఉందో చూద్దామని వచ్చిన భానుమతి తల్లిదండ్రుల ద్వారా అసలు విషయం రంగారావు గారికి  తెలిసి పోతుంది.ఈ చిక్కులన్నిటిని ఎలా తప్పించుకుని బయటపడ్డారు ఆ జంట అనేది చివరి సన్నివేశం.

నటన విషయం వస్తే రంగారావు గారు ఒక మంచి మామ గారిగా ఎలా నటిస్తారో అన్నది అందరికీ తెలిసిన విషయమే  ప్రతీ తల్లిదండ్రి ఇంతమంచి మామగారు  ఉన్న కుటుంభానికి తమ పిల్లను పంపాలి అనే తరహాలో ఆయన నటన  ఉంటుంది..ఇక సూర్య కాంతం గారు గయ్యాళిగా నటించి ఎంత మెప్పిస్తారో ఒక అమాయకపు తల్లిగా అంతే బాగా నటించి మెప్పిస్తారు,రమణారెడ్డి,పద్మ నాభం గార్ల కామేడీ  గురించి చెప్పనక్కరలెదు వారు హాస్యానికి రారాజులు.. నాగేశ్వర రావుగారు ఈ పాత్రకు చక్కగా సరిపోయారు..అయితే భానుమతి గారే ఈ పాత్రకు ఏ మాత్రం నప్పరు.ఆమె లావుగా నాగేశ్వరరావు గారికి అక్కలా ఉంటుంది.అయితే ఆ రోజుల్లో అందం కంటే అభినయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి ఆ విషయానికి. అయితే నటనా పరం గా ఈ పాత్రకు ఆమె బాగా సరిపోయారు .ఒక ప్రక్క అత్త,మామలను గౌరవించే కోడలిగా మరొక ప్రక్క భర్త అల్లరికి కళ్ళెం వేసే చిలిపి భార్యగా బాగా నటించారు.

ఈ సినిమా ప్రధానం గా భార్యా,భర్తల విరహానికి సంభందించినదైనా ఏ మాత్రం ఎబ్బెట్టు లేకుండా  హాస్యం మిళితం చేసి తీసారు.

ఇక పాటల విషయానికొస్తే భానుమతి గారి సంగీతం సంగతి తెలిసిందే.ఇందులో మేలుకోవయ్య కస్తూటి రంగ సాంగ్ తెల్లవారు జామున వింటే మనసు ఎంతో ప్రశాంతం గా అయిపోతుంది .అలాగే మావారు శ్రీవారు మా మంచివారు పాట చక్కని సాహిత్యం తో అలరిస్తుంది .ఇంకా లాలి లాలి గోపాల బాలా లాలి ,కన్నులె నీకోసం కాచుకున్నవి లాంటి ఎన్నో చక్కని పాటలు మనసునును రంజింపజేస్తాయి.

మొత్తం మీద హాయిగా నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడదగ్గ సినిమా.

***   ***   ***

BOOKS AND GALFRIENDS కోసం ఒక చక్కని సినిమా సమీక్షని అందిమ్చిన నేస్తం గారికి మా మన:పూర్వక కృతఙ్ఞతలు.


మరువం ఉష : ఎనిమిదో చేప కథ

In కవిత, GUEST book, Original on September 29, 2009 at 8:55 am

ఈ కథ చెప్పింది “మరువం” ఉష గారు. ఉష గారు రాసే కవిత ల గురించి చెప్పే సాహసం చేయలేను. రెణ్ణెల్ల పైగా మూత పడ్డ  BOOKS AND GALFRIENDS (That’s for some good reasons. Now coming back again with right content, and in a more crowded way. రెగ్యులర్ టపాలతో. Now we have very good content in all the things we want.) ని నా టైటిల్ పోస్ట్ తో ప్రారంభిద్దామనుకున్నా కాస్త సమయాభావం వల్ల ఆలశ్యం అయింది. ఈలోగా ఈ చక్కని కవిత.

చేపా చేపా అంటూ నా మీద కథ కట్టి
అనగనగా అంటూ పాపతో ఊ కొట్టించి
ఏమయ్యా మనిషీ ఎన్నేళ్ళిలా?
విన్న నాకే వెగటాయే…
ఇక నేను ఓ కథ నీకు వినిపిస్తానిక

నేనున్న చెరువు నీళ్ళు మక్కువగా
మబ్బు రంగు పులుముకుని
ఒడ్డునున్న రాయి రప్పని ఒరుసుకుని
వెనక్కి ముందుకి వొళ్ళిరుసుకునే యేళ
నీలికళ్ళ చిన్నాడు వేటకనివచ్చినాడు

నా జతగాళ్ళు ఎగిసెగిసి పడి నవ్వినారు
ఏరా ఏరా ఎందుకు నవ్వినారంటే
చూడు చూడు అబ్బాయి వెనక చూడమనే
బంగారుఛాయ వొంటిదా ఆమె కురులదాన్నట్లు
చూడచక్కని చిన్నది వయ్యారి నడకల వచ్చినాది

పిలగాని చేయి గేలం నా వైపు విసిరితే
సొగసరి చూపు వల వాని వంక విసిరేను
చేత చిక్కిన నను చలాగ్గ తిరిగి నీట విసిరే ఆ యువ జాలరి
వోరకంట చిక్కిన చెలికాని పెదవి పంటి క్రింద నొక్కే నా సింగారి
ఇది కదా ఎప్పటి కథ అని నా జతగాళ్ళు మళ్ళీ కిసుక్కుమనే

ఈ సిత్రాలు చూడను చుక్కపొద్దాయే
సందమామ నడుమ సర్దుకుని కళ్ళిప్పి చూసేను
ఇసుక పక్క మీద ఆ పడుచుజంట చేయి చేయి కలిపి
కనుల వెన్నెల్లు, కబుర్ల తెమ్మెరలు కలబోసుకుని
వలపు వొలకబోస్తే చుక్కంటి ఓ చేపపడుచు నా వంక కనుగీటి నవ్వేను.

I thank ఉష గారు for giving BOOKS AND GALFRIENDS an excellent poem. Belated దసరా శుభాకాంక్షలు.

గీతాచార్య

Cool. We got the inspiration behind this sweet poem too. In the words of Usha garu,


One of our sub-contractors come on Fri to do fishing.  he catches and throws them back.  Last week he caught a foot long 1/2 foot wide fish, I took pic of it and we let it go in to waters.  that’s it. His girl friend and him were enjoying after fishing on a moonlit night lying down on the sand I put to mimic a beach near the lake and it is so nice to observe them watching the skies and whisper to each other in smiles.  I am so spell bound for the magic of bonding two hearts make. A feel that I could see from the eyes of nature. Hence took fish to tell this on my behalf.

దించుకోండి, పండుగ చేసుకోండి. :-) OpenOffice.Org

In యమ టెక్కునాలజీ, Yama TECHnology on August 4, 2009 at 3:44 pm

మీ బ్లాగు పోస్టులన్నింటినీ పీడీఎఫ్ చేసి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి అప్పుడప్పుడూ మళ్ళా చదువుకోవాలని ఉంటుందా? ఒక చిన్న పని చేసి ఆ ఆనందం పొందొచ్చు.

Heard about the FOSS movement? The Free and Open Source Softwares? Now am not going to explain what that great thing is. But am going to explain myself about a small trick which I have learnt recently. If it is useful to you, I’l be happy. You can use it. If you already know it, just spread the thing to everybody you know, so that they can get the benefit of this free and efficient software.

Now coming to the point. See the second widget on the right hand side. Wrote… “USE OPENOFFICE.ORG”. yes. Click there and download the open-office package. It’s just like the MS Office package. Now, if you use Baraha, write whatever you want in wordpad, save it. Topen the OpenOffice Writer (Equivalent of the MS Word. Working beter than MS Word 2003, and have some more fasntastic features). Go to the File Menu, and click ‘open’. Then from it catch the saved wordpad telugu file, and right click on it. Go to ‘open with’ and there you find open with ‘swriter’. Click it, and BingO! You will get your telugu script on the OpenOffice Writer, as it is. Then Search for the icon suggesting pdf (when u put the cursor on it, it shows the msz… ‘export as pdf’). Click it, and save the file where you want. Then you will have the pdf of your telugu post ready, with out and word to pdf converting software.

HowZ it? may be simple technique, and not well written. I’m not a techie, nor an expert in Computer fields. Just learning things on my own, and feel like share it with some friends, and explain the process to myself.

The OpenOffice is the best office package I have ever seen. It has all the features of MS office 2003, and many more if you are willing to learn. Very simple, and nice. Have a try. A completely free software, with best of the features. Surely it matches the functionality of Office 2007, if not better it.

Today I have become SONIA GANDHI by sacrificing my system to Chaithi (she has exams), so I gota make this post in the cafe. You know how it is… You can write a big post on home system, while I can not even finish typing a 2 line comment in telugu. ;-) That is the reason why I’m unable to put the screen shots for better understanding.

BOL Chaithi. You too wish her a best of work, not luck, in the exams.

గీతాచార్య

Follow

Get every new post delivered to your Inbox.